చాలా కాలం నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక పాడ్‌కాస్ట్ వీడియో షూట్ చేశాడు.
Also Read:AMB: ఏఎంబీలో వీరమల్లు చూసిన జాన్వీ, బుచ్చిబాబు?
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని అడిగితే, వెంటనే ఆయన ఏమాత్రం తడుముకోకుండా సెప్టెంబర్ నెలలో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అన్నాడు. ఏదైనా లీక్ ఇవ్వమని అడిగితే, “లీక్ ఏమీ లేదు, షూటింగ్ మొదలు పెట్టబోతున్నామని” అన్నాడు.
Also Read:WI vs Pak: వెస్టిండీస్‌తో సిరీస్‌కు పాక్ జట్టు ప్రకటన.. బాబర్‌కు చుక్కెదురు.. అఫ్రిది రీఎంట్రీ!
అయితే, షూటింగ్ మొదలుపెట్టి నాన్‌స్టాప్‌గా పూర్తి చేస్తామంటూ క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ అధికారిగా కనిపించబోతుండగా, దీపికా పడుకొణెని తప్పించి తృప్తి సినిమాలో హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. ప్రభాస్ 25వ సినిమాగా రూపొందుతోంది ఈ సినిమా. సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌తో పాటు టి-సిరీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది.