Sonu Nigam : క్షమాపణ చెప్పినా కూడా వదలడం లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. సెలబ్రెటీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తీవ్రమైనా పరిణామాలు ఎదురుకొవాల్సి వస్తుంది. ప్రజంట్ బాలీవుడ్ సింగర్ సోనూనిగమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని కోరగా, సోనూ నిగమ్ ‘కన్నడ, కన్నడ, అంటూ ఇలాంటి విబేధాల తోనే పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు కాస్తా కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోను నిగమ్‌తో ఉన్న అన్ని ఒప్పందాలను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే సోను సోషల్ మీడియాలో భాగంగా వారికి క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ కన్నడ ప్రజలు అతడిని క్షమించేలా కనపడట్లేదు.
Also Read : Samantha : ‘శుభం’ మూవీలో నటించడానికి కారణం ఇదే..
Also Read
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
తాజాగా ఆయన పాడిన పాటను సినిమా నుంచి తొలగించినట్లు కులదల్లి కీల్యావుడో అనే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా.. ప్రకటన విడుదల చేసింది.. ‘సోను నిగమ్ గొప్ప గాయకుడని మాకు తెలుసు. కానీ ఇటీవల ఆయన కన్నడ భాష గురించి మాట్లాడిన విధానం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. కన్నడ భాషకు జరిగిన ఈ అవమానాన్ని మేము ఎంత మాత్రం సహించలేము. అందుకే, ఆయన పాడిన పాటను చిత్రం నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాము’ అని పేర్కొన్నారు. అయితే సోను నిగమ్ ఆలపించిన ‘మనసు హాడతాడే’ అనే ఈ పాట విడుదలకు ముందే మంచి స్పందన ను అందుకుంది. కానీ ఈ వివాదం కారణంగా ఆ పాటను చిత్రం నుంచి తీసేశారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!