Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఉన్న శివకార్తికేయన్.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ మరియు టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ 56వ ప్రాజెక్ట్ ‘సేయోన్’ పై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లార్డ్ మురుగన్ (సుబ్రమణ్య స్వామి) ఆధ్యాత్మిక సంకేతాలతో డిజైన్ చేయగా.. నేడు షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా వదిలిన సరికొత్త పోస్టర్ సినిమాలోని ఇంటెన్సిటీని చూపిస్తోంది.
ఈ కొత్త పోస్టర్లో శివకార్తికేయన్ ఎంతో సీరియస్ లుక్‌తో, కోపంతో రగిలిపోతూ చూస్తున్న విజువల్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. పోస్టర్లో ఒకవైపు భారీగా ఎగసిపడుతున్న మంటలు, చీకటి.. సాంప్రదాయ టెక్స్చర్స్ కలయిక సినిమా ఏ రేంజ్ యాక్షన్ మోడ్‌లో ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుంది. అలాగే వివేక్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సన్ లోకేష్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శివకార్తికేయన్ విభిన్నమైన లుక్, కమల్ హాసన్ ప్రొడక్షన్ వాల్యూస్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్.. ఇవన్నీ చూస్తుంటే ‘సేయోన్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..