Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byreddy Siddharth Reddy: కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ బహుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలతో పాటు పలు అంశాలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. మంత్రి టీజీ భరత్ తనకు టికెట్ రాలేదని వ్యాఖ్యానిస్తున్నారని, “ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న సతీష్ కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు వచ్చాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే తాను చెప్పిన వెంటనే ఆ కంపెనీ నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పిస్తారని ఆరోపించారు.
ఎన్నికల ముందు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆరోపణ అయినా నిరూపించారా అని ప్రశ్నించారు బైరెడ్డి.. “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమంలో తాను రూ.600 కోట్లు తిన్నానని ఆరోపించారని, కానీ ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో రూ.40 కోట్ల అక్రమాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఇక, బైరెడ్డి శబరిపై కూడా సిద్ధార్థరెడ్డి విమర్శలు గుప్పించారు. “బైరెడ్డి శబరి తండ్రిని వెస్ట్ ఫెలో అని గౌరు వెంకటరెడ్డి అన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే అయి ఏమి చేశాడని మాండ్ర శివానందరెడ్డి విమర్శించినప్పుడు శబరి ఎందుకు స్పందించలేదు?” అని ప్రశ్నించారు.
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
శబరి తండ్రి ఆమెకు ఎంబీబీఎస్, పీజీ సీట్లు కొనిచ్చారని, అలాంటి తండ్రిపై విమర్శలు వచ్చినా ఆమె స్పందించడం లేదన్నారు. అలాగే టీజీ వెంకటేష్ గౌరవం కోల్పోయారని, అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు బైరెడ్డి.. మీసాలు తిప్పుకుని తిరిగేవాళ్లు మీసాలు దించుకుని మీ దగ్గరకు ఎవరు వచ్చారో చెప్పాలి అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. “కష్టమో, నష్టమో నేను నిలబడతా. నా దగ్గర రూపాయి ఆస్తి లేదు. నాకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో కొందరు టచ్‌లో ఉన్నారని, రేపు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తమను కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన కామెంట్లు చేశారు..
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!