తాజాగా ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో, సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేసే విషయంలో సర్‌ప్రైజ్ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.”మనం ఏదైనా సినిమా కమిట్ అయినప్పుడు, ఆ ప్రొడ్యూసర్ ఎవరి మీద బేస్ చేసుకుని ఆ సినిమా ఓకే చేస్తున్నారనేది చాలా ముఖ్యం. మీరు ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’, ఇప్పుడు ‘తెలుసు కదా’ సినిమాలు తీసుకుంటే, ముఖ్యంగా విశ్వ గారు, ‘మీకు సినిమా నచ్చింది కాబట్టి మీరు వెళ్లి సినిమా చేసేయండి’ అని చెప్పారు. అలాంటప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే, నాకు ఎవరూ కథలు చెప్పలేరు, నాకోసం ఎవరూ కథలు రాయలేదు. నేను సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాల్సి వచ్చింది. నాకు వేరే ఆప్షన్ లేక నేను నేర్చుకున్నాను. అది కూడా ఫిల్మ్ స్కూల్‌కి వెళ్లి కాదు, ఆన్ సెట్ మీద నేర్చుకోవాల్సి వచ్చింది.
Also Read:Siddu Jonnalagadda : హీరోయిన్ల డేట్ల కోసం హీరోలే వెయిట్ చేస్తారు!
ఇప్పుడు నా ప్రొడ్యూసర్ నన్ను నమ్మి సినిమా తీస్తున్నప్పుడు, నేను 100% న్యాయం చేయాలి. నేను ఇప్పటికే చాలా రాక్ బోట్‌లో ఉన్నాను. ఎందుకంటే, ‘ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను’ అంటారు. మీకు ఇక్కడ ఒక పచ్చి నిజం చెబుతున్నాను. సినిమా ఆడితే, ‘గ్రేట్ జాబ్, గ్రేట్ డైరెక్షన్, గ్రేట్ సినిమాటోగ్రఫీ, అంతా గ్రేట్ గ్రేట్’ అని అంటారు. ఒకవేళ పోయిందంటే, ‘నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, నీవల్ల పోయింది’ అంటారు. నేను దానికి తెగించి ఇక్కడ ఉన్నాను. హిట్ అయితే అందరికీ క్రెడిట్, పోతే నా మీద మాత్రమే బ్లేమ్. నేను దానికి తెగించి ఇక్కడ ఉన్నాను. నేను ఇన్వాల్వ్ అవ్వకుండా సినిమా చేయాలనేది నా కల. నాకు హీరోలా ఉండాలి అని ఉంటుంది,” అంటూ సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.