తాజాగా ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో, సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేసే విషయంలో సర్‌ప్రైజ్ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.”మనం ఏదైనా సినిమా కమిట్ అయినప్పుడు, ఆ ప్రొడ్యూసర్ ఎవరి మీద బేస్ చేసుకుని ఆ సినిమా ఓకే చేస్తున్నారనేది చాలా ముఖ్యం. మీరు ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’, ఇప్పుడు ‘తెలుసు కదా’ సినిమాలు తీసుకుంటే, ముఖ్యంగా విశ్వ గారు, ‘మీకు సినిమా నచ్చింది కాబట్టి మీరు వెళ్లి సినిమా చేసేయండి’ అని చెప్పారు.…