Pahalgam Attack : వరుసపెట్టి క్యాన్సల్ అవుతున్నా ప్రముఖుల షోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్‌గా జమ్ము కశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్‌లో ఉగ్రవాదులు కృరంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా 28 మంది అమాయకులు ప్రాణాలు తీశారు. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేసింది. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇక ఉగ్రదాడి అనంతరం దేశంలో పరిస్థితులు ఉత్కంఠగా మారాయి. ఇప్పటికే పలు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ ఉండడంతో, పలువురు సినీ ప్రముఖులు తమ షోలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే సింగర్ అర్జిత్ సింగ్ ఏప్రిల్ 27న చెన్నైలో జరగాల్సిన తన షో ను రద్దు చేసుకోగా.. ఇందులో భాగంగా తాజాగా సింగర్ శ్రేయాఘోషల్ కూడా తన కన్సర్ట్‌ను రద్దుచేసుకుంది.
Also Read : Sri vishnu : శ్రీవిష్ణు ‘సింగిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
‘ఆల్ హార్ట్స్ టూర్’ అనే పేరుతో శ్రేయ ఘోషల్ దేశ విదేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే నేడు గుజరాత్‌లోని సూరత్ వేదికగా ఆమె మ్యూజిక్ కన్సర్ట్ జరగాల్సి ఉండగా.. తాజాగా ఈ కన్సర్ట్‌ను క్యాన్సిల్ చేసుకున్నామని ప్రకటించింది. ఇప్పటికే షో కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆమె చెన్నై, కోయంబత్తూరు ప్రదర్శనలు ఇవ్వగా ఈరోజు సూరత్‌లో జరగాల్సిన ఈ కార్యక్రమం రద్దయింది. మరోవైపు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ‘హుకుమ్’ పేరుతో ప్రపంచ టూర్ చేస్తున్నారు. మే 31న బెంగళూరులో జరగనున్న ఆయన కాన్సర్ట్ టికెట్లు గంటలోనే అమ్ముడయ్యాట. ప్రేక్షకుల ఆదరణతో జూన్ 1న కూడా కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ ఉగ్రదాడి కారణంగా రెండో రోజు టికెట్ల అమ్మకాలు వాయిదా పడ్డాయి. మరో కొత్త డేట్ త్వరలో ప్రకటించనున్నారట.
తాజావార్తలు
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
-
Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్‌లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!