Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్‌లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
- రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో
- ధర పరంగా రెండూ దాదాపు సమానం
- బ్యాటరీ, రేంజ్, పనితీరు, టాప్ స్పీడ్ వంటి అంశాల్లో కొన్ని కీలక తేడాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ బైక్‌లకు కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. పెట్రోల్ బైక్‌కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి రివోల్ట్ RVX, ఓబెన్ రోర్ ఈవో రెండు మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి. ధర పరంగా రెండూ దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, బ్యాటరీ, రేంజ్, పనితీరు, టాప్ స్పీడ్ వంటి అంశాల్లో కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. ఈ రెండు బైక్‌లలో ఏది సరైన ఎంపికో తెలుసుకుందాం.
బ్యాటరీ, రేంజ్లో
బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ విషయంలో ఓబెన్ రోర్ ఈవో కొంత ముందంజలో ఉంది. ఇందులో 4.4kWh బ్యాటరీ ప్యాక్ అందించగా, IDC ప్రమాణాల ప్రకారం ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మరోవైపు రివోల్ట్ RVXలో 3.24kWh బ్యాటరీ ఉండగా, దీని IDC సర్టిఫైడ్ రేంజ్ 160 కిలోమీటర్లు. కాబట్టి రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఓబెన్ రోర్ ఈవో మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
Also Read
- గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
- Russia vs Ukraine: 4.5 లక్షల మరణాలు..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణమైన పోరాటం!
- Tesla Cybertruck: "మూడేళ్లకే కథ ముగిసింది".. టెస్లా 'సైబర్ ట్రక్' ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
- స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
పనితీరు, టాప్ స్పీడ్
వేగం, యాక్సిలరేషన్ పరంగా కూడా ఓబెన్ రోర్ ఎవో మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ బైక్ కేవలం 3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 110 కిమీ/గం.
అదే సమయంలో రివోల్ట్ RVX నగర ప్రయాణాలకు అనువుగా రూపొందించారు. ఇందులో బూస్ట్ మోడ్ ఉండటం వల్ల ఓవర్‌టేకింగ్ సులభంగా చేయవచ్చు. ఈ బైక్ 3.7 సెకన్లలో 0-40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 90 కిమీ/గం.
ధరలో ఎంత తేడా?
ధర పరంగా రెండు బైక్‌ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు.
రివోల్ట్ RVX ప్రారంభ ధర: రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ఓబెన్ రోర్ ఈవో ప్రారంభ ధర: రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)
అయితే రాష్ట్రాల వారీగా లభించే EV సబ్సిడీలు, పన్నుల ఆధారంగా ఆన్-రోడ్ ధరలు మారే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు మీ నగరంలోని తాజా ధరను తెలుసుకోవడం మంచిది.
ఏ బైక్ కొనాలి?
మీకు ఎక్కువ రేంజ్, అధిక వేగం, మెరుగైన పనితీరు ముఖ్యమైతే ఓబెన్ రోర్ ఈవో మంచి ఎంపికగా చెప్పవచ్చు. దీని పెద్ద బ్యాటరీ, 180 కిలోమీటర్ల రేంజ్, 110 కిమీ/గం టాప్ స్పీడ్ పనితీరుకు ప్రాధాన్యత ఇచ్చే రైడర్లను ఆకట్టుకుంటాయి. అయితే రోజువారీ నగర ప్రయాణాలు, ఆఫీస్ కమ్యూటింగ్, సౌకర్యవంతమైన రైడింగ్ కోసం చూస్తున్నట్లయితే రివోల్ట్ RVX మరింత ప్రాక్టికల్ ఎంపికగా నిలుస్తుంది. దీని బూస్ట్ మోడ్, నగర రోడ్లకు అనుకూలమైన పనితీరు, మార్చుకోగలిగే బ్యాటరీ వ్యవస్థ వినియోగదారులకు అదనపు సౌలభ్యాన్ని అందిస్తాయి.
రివోల్ట్ RVX, ఓబెన్ రోర్ ఎవో రెండూ తమ తమ విభాగాల్లో మంచి ఎలక్ట్రిక్ బైక్‌లే. మీ రోజువారీ ప్రయాణ దూరం, బడ్జెట్, ఛార్జింగ్ సౌకర్యాలు, వినియోగ అవసరాలను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోవడం ఉత్తమ నిర్ణయం అవుతుంది.
తాజావార్తలు
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
-
OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?