‘స్త్రీ’ సినిమాతో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. అప్పటి వరకు సాఫ్ట్ క్యాకెక్టర్‌లతో అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఒక్కసారిగా హారర్ చిత్రం తో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా చాలా రోజులుగా ‘చావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో శ్రద్ధ నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే..
Also Read : Akanda2 : యూఎస్‌లో ‘అఖండ 2’ టార్గెట్ ఎంతో తెలుసా..
తాజాగా ఈ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట్లో సందడి చేస్తోంది. జానపద ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన మహారాష్ట్ర గాయని, నృత్యకారిణి విరాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న ట్లు సమాచారం.ఈ బయోపిక్ కేవలం ఒక నర్తకి గురించి మాత్రమే కాదు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో సరిహద్దులను చెరిపేసి రాబోయే తరాలకు జానపద కళల గురించి తెలియజేసిన ఒక గొప్ప మహిళ గురించి తెరకెక్కబోతున్న ట్లుగా శ్రద్ధ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.