ఇండస్ట్రీ ఏదైనప్పటికి హీరోయిన్‌ల కెరీర్ టైమ్ తక్కువ. కొత్త వాలు వచ్చే కొద్ది పాత హీరోయిన్ లకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. కానీ అందరి విషయంలో అలా జరగాలి అని లేదు. కొంత మంది హీరోయిన్‌లు ఏంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికి చక్రం తిప్పుతున్నారు. వారిలో తమన్నా ఒకరు. నటిగా తమన్నా ఎన్నో రకాల పాత్రలు పోషించింది. గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ దాదాపు అందరు హీరోలతో జతకట్టింది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా గ్లామర్ డోస్ పెంచిన తమన్నా వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తుంది. ఇక తమన్నా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతుందట. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన సిని ప్రయాణం గుర్తు చేసుకుంది..
Also Read: Siddu Jonnalagadda : వైష్ణవి చైతన్యలో నాకు నచ్చిన విషయం అదే
తమన్నా మాట్లాడుతూ.. ‘ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు అప్పుడే 20 ఏళ్లు అవుతోంది. నమ్మలేక పోతున్న. ఎంతో ఆనందంగా ఉంది. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉంటానని అనుకోలేదు. నేను నా పదో తరగతిలో ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. చదువుల్లో టీచర్లు నాకెంతో హెల్ప్ చేసేవారు. వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇన్నేళ్ల జర్నీలో నా 21వ పుట్టినరోజు నాడు జరిగిన ఒక సంఘటన మాత్రం మర్చిపోలేను. పుట్టినరోజు సందర్భంగా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని ఇంట్లోనే ఉన్నా. నాపై ఓ పత్రికల్లో ‘తమిళంలో నంబర్ 1 నటి’ అని సెపరేట్ ఆర్టికల్ వచ్చింది.. అది చదువుతూ నేను కన్నీళ్లు పెట్టుకున్న. అంత త్వరగా ఆ స్థాయికి చేరుకుంటారు అని ఎప్పుడూ అనుకోలేదు. నంబర్ 1 స్థానానికి వెళ్లాక.. అక్కడే కొనసాగడం అంత సులభం కాదు. నేను డబ్బుల కోసం కాకుండా అదొక బాధ్యతగా తీసుకున్న. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేస్తూ, మెప్పిస్తూ ఈ స్థాయికి చేరుకున్న’ అని చెప్పుకొచ్చింది తమన్నా.