Producer KP Drugs Case: డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత కేపీ చౌదరి కస్టడీ నివేదికలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాలీవుడ్ లో 12 మందికి డ్రగ్స్ సరఫరా చేశానని కేపీ వెల్లడించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. కేపీని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖులు, నేతల కుమారులకు డ్రగ్స్ అమ్మినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేపీ చౌదరిని పోలీసులు విచారించారు. కేపీ చౌదరి కాల్ లిస్ట్‌ను డీకోడ్ చేసిన పోలీసులు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆశురెడ్డితో పాటు తెలుగు సినిమాల్లో ఎన్నో ఐటెం సాంగ్స్ చేసిన నటితో వందల కొద్దీ కాల్స్ చేసినట్లు గుర్తించారు. కానీ ఈ కాల్స్‌పై కేపీ చౌదరి స్పందించకపోవడం గమనార్హం. అలాగే 12 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు కేపీ చౌదరి అంగీకరించాడు. వారిలో కొందరి పేర్లను మాత్రమే ఆయన వెల్లడించారు.
Read also: Sikkireddy Mother: కేపీ చౌదరి మాకు తెలుసు.. కానీ ఎలాంటి వాడో మాకు తెలియదు
రఘుతేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేష్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ లకు డ్రగ్స్ విక్రయించినట్లు తెలిపారు. కేపీ చౌదరి కేసులో ఫోన్ కాల్స్, బ్యాంకు లావాదేవీలు కీలకంగా మారాయి. కేపీ కాల్ లిస్టులో ఉన్న వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అతడి కాల్ డేటాను డీకోడ్ చేయడంతో బ్యాంకు ద్వారా పలువురికి చెల్లింపులు చేసినట్లు నిర్ధారణ అయింది. కాగా, వీటిలో 11 అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన పోలీసులు.. ఎందుకు చేశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరోవైపు సోషల్ మీడియా లో కొందరు బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పేరును కూడా బయటకు లాగారు. దీంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ భామ. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా ఆమె ఖండించారు.. సోషల్ మీడియా లో పేర్కొన్నట్లు తనకు ఎవరితో కూడా ఎలాంటి సంబంధాలు లేవని తనపై వచ్చిన వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలని అషు రెడ్డి తెలిపింది.
బ్యూటీ విత్ బ్రెయిన్.. శ్రీలీలా, కృతి మధ్య ఇదే తేడా!