Shivarajkumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ పెద్ది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ మంచి అంచనాలను పెంచేశాయి. రామ్ చరణ్ లుక్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రపై ఇప్పటికే చాలా రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆయన తన పాత్రపై క్లారిటీ ఇచ్చారు. కన్నడలో ఆయన నటిస్తున్న తాజా మూవీకి సంబంధించిన ఈవెంట్ లో ఆయనకు పెద్ది సినిమాపై ప్రశ్న వస్తే స్పందించారు.
Read Also : Vijay Devarakonda : విజయ్ స్టార్ హీరో కాదు.. ప్రముఖ జర్నలిస్ట్ కామెంట్
‘నేను పెద్ది సినిమాలో రెండు రోజలు షూట్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఆ మూవీలో నా పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆ మూవీ డైరెక్టర్ చాలా గుడ్ పర్సన్. స్క్రిప్టు కూడా బాగుంది. అందుకే ఆ మూవీ ఒప్పుకున్నాను. నా పాత్ర మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది’ అంటూ తెలిపాడు శివరాజ్ కుమార్. మెగా ఫ్యామిలీతో శివన్న కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ అనుబంధం నేపథ్యంలోనే ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. పెద్ది సినిమాలో చరణ్ కు కోచ్ గా కనిపించబోతున్నాడు అని సమాచారం. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ చేయబోతున్నారు.