Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. హిట్, ప్లాపుల సంగతి పక్కన పెడితే.. అతను వరుస సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అలాంటి విజయ్ మీద తాజాగా బాలీవుడ్ లోని ప్రముఖ మీడియా జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ మీద బాలీవుడ్ మీడియా చేసిన ప్రచారం చూసి చాలా షాక్ అనిపిస్తోంది. లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన్ను పెద్ద సూపర్ స్టార్ అన్నట్టు బాలీవుడ్ మీడియాలో చూపించింది. కానీ టాలీవుడ్ కు వచ్చి చూస్తే అతను ఇక్కడ స్టార్ హీరో కాదు. టైర్-2 హీరో మాత్రమే’ అంటూ కామెంట్ చేశాడు.
Read Also : Karthi : పిలిచి ఛాన్స్ ఇస్తే కార్తీకి తలనొప్పిగా మారిన డైరెక్టర్
‘విజయ్ ఇప్పటి వరకు 12 సినిమాలు తీస్తే అందులో 9 ప్లాప్ అయ్యాయి. అతని లైగర్ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయని ప్రచారం చేశారు. కానీ రియల్ గా చూస్తే రూ.20 కోట్లు కూడా రాలేదు. అలాంటి విజయ్ ను సల్మాన్ ఖాన్ తో పోల్చారు. సల్మాన్ ఖాన్ ప్లాప్ మూవీ కూడా రూ.100 కోట్లు వసూలు చేస్తుంది. విజయ్ ను సల్మాన్ తో ఇంకెప్పుడూ పోల్చుకోవద్దు’ అంటూ హిమేశ్ తీవ్ర మైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై విజయ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సొంతంగా ఎదిగాడని.. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయకున్నా.. ఇలా అక్కసు వెల్లగక్కడం మంచిది కాదంటూ చురకలు అంటిస్తున్నారు. విజయ్ కు సరైన హిట్ పడితే తానేంటో ప్రూవ్ చేసుకుంటాడు అంటూ చెబుతున్నారు.