Shilpa Shirodkar: ‘జటాధర’తో టాలీవుడ్ రీఎంట్రీ.. నేను ఇంతకు ముందు చేయలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘జటాధర’. ఒక సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంతో సీనియర్ నటి శిల్పా శిరోధ్కర్ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సినిమా విశేషాలను పంచుకున్నారు.
Also Read:Tollywood Producers: మునగచెట్టు ఎక్కించి వాళ్ళపై నిందలు ఎందుకు?
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
చాలా ఏళ్ల క్రితం వచ్చిన ‘బ్రహ్మ’ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో నటించడం చాలా ఆనందంగా ఉందని శిల్పా తెలిపారు. “ఈ చిత్రంలో నేను ‘శోభ’ అనే పాత్రలో కనిపిస్తాను. డబ్బుపై విపరీతమైన ఆశ, ఎలాగైనా ధనవంతురాలు కావాలనే తపన ఉన్న పాత్ర ఇది. ఇలాంటి పాత్ర నేను ఇంతకుముందు చేయలేదు, అందుకే చాలా సవాలుగా అనిపించింది. దర్శకుల స్పష్టమైన విజన్, వారి మద్దతుతో ఈ పాత్రను పోషించగలిగాను. ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది,” అని అన్నారు.
హీరో సుధీర్ బాబు గురించి మాట్లాడుతూ, “ఆయనతో పనిచేయడం ఒక మంచి అనుభవం. ఈ తరం నటుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సుధీర్ బాబు చాలా అంకితభావంతో పనిచేశారు. ఆయన మాకు బంధువు అయినప్పటికీ, సెట్‌లో మేమిద్దరం చాలా ప్రొఫెషనల్‌గా నటులుగానే ఉన్నాము,” అని చెప్పారు. అలాగే, “మా ట్రైలర్‌ను మహేష్ బాబు గారు విడుదల చేయడం, నన్ను ఇండస్ట్రీకి తిరిగి స్వాగతించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది,” అని శిల్పా పేర్కొన్నారు.
Also Read:Sreeleela : నేను శ్రీదేవిని కాదు.. నా బాడీ టైప్ నాకు తెలుసు – శ్రీలీల
‘బ్రహ్మ’ సమయానికి, ఇప్పటికీ తెలుగు పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయని శిల్పా అభిప్రాయపడ్డారు. “టాలీవుడ్ ఇప్పుడు కంటెంట్ పరంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఒక ఉత్తమ దశలో ఉంది,” అని ఆమె అన్నారు. ‘జటాధర’ గురించి చెబుతూ, “ఇది అద్భుతమైన విజువల్స్, బలమైన భావోద్వేగాలు, మంచి సంగీతం ఉన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్. ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది,” అని హామీ ఇచ్చారు.
దర్శకులు వెంకట్, అభిషేక్‌లకు నటీనటుల నుంచి ఏం కావాలో స్పష్టంగా తెలుసని, నిర్మాతలు ఉన్నతమైన నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించారని ప్రశంసించారు. “ట్రైలర్ విడుదలయ్యాక తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నవంబర్ 7న అందరూ ఒక అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నారు,” అని శిల్పా శిరోధ్కర్ ముగించారు.
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!