యంగ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న శ్రీలీల లుక్‌లో ఇటీవల వచ్చిన మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ చలాకీగా, నాజూగ్గా కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడు మరింత స్లిమ్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆమె తాజా ఫోటోలు చూసిన అభిమానులు “ఇంత సన్నగా ఎందుకైంది?”, “ఏదైనా స్పెషల్ ప్రిపరేషన్ జరుగుతోందా?” అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయంపై శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. “ఇటీవల ఫుడ్ మీద కంట్రోల్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. సరైన ఆహారం తినాలని ఫిక్స్ అయ్యాను. ముందు అమ్మమ్మ ఒంగోలు నుంచి అరిసెలు పంపిస్తే, ఆ ప్యాకెట్ అయిపోయే వరకు కూర్చొని తినేసేదాన్ని. చెకోడీలు, బజ్జీలు అన్నీ టపటపా తినేదాన్ని. ఇప్పుడు వాటిని తగ్గించాను” అని నవ్వుతూ చెప్పింది.
Also Read: Rashmika : ట్రీట్‌మెంట్ అయ్యింది అన్న రష్మిక.. కంగారులో ఫ్యాన్స్
ఇంత సన్నబడటంతో చాలామంది ఆమెను గతంలో బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత స్లిమ్ అయిన శ్రీదేవితో పోల్చుతున్నారు. అయితే దానికి శ్రీ లీల మాత్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. “నేను శ్రీదేవిని కాదు. ప్రతి ఒక్కరి బాడీ టైప్ వేరుగా ఉంటుంది. నా బాడీ గురించి నాకు బాగా తెలుసు. పైగా నేను డాక్టర్‌ని కూడా. స్క్రీన్‌పై మన కోసం డబ్బులు పెట్టి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఉంటారు కాబట్టి, మనం బెస్ట్‌గా కనిపించడం వాళ్లకు కూడా ఆనందం ఇస్తుంది. అందుకే నా లుక్ మీద కాస్త కేర్ తీసుకుంటున్నాను,” అని చెప్పింది. అంతేకాక,
ప్రస్తుతం తాను డిఫరెంట్ రోల్స్ చేస్తోన్నానని కూడా శ్రీలీల తెలిపింది. “ఇటీవలే మాస్ జాతరలో నా పాత్ర చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. మాస్ ఫీలింగ్‌తో పాటు కామెడీ టచ్ కూడా ఉంటుంది. ఇలాంటి పాత్రలు చేయడం నాకు చాలా ఎంజాయ్‌మెంట్ ఇస్తోంది,” అంటూ చెప్పింది. స్లిమ్ లుక్‌కి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కి, నేచురల్ అటిట్యూడ్‌కి శ్రీలీల అభిమానులు ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, తన ఆరోగ్యం, బాడీ టైప్‌పై అవగాహనతో ఉండే రోల్ మోడల్‌గా కూడా శ్రీలీల మరోసారి తన ప్రత్యేకతను చూపించింది.