ధనుష్ ఓ వైపు హీరోగా బిజీగా ఉన్నప్పటికీ మరో వైపు మెగా ఫోన్ పట్టడమే కాకుండా నిర్మాతగానూ ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరో రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబంతో మేనల్లుడిని తెరకు చేసాడు ధనుష్. కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగానూ రిస్క్ చేస్తున్నాడు. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్, ప్రొడ్యూసర్ కూడా తానే అయ్యాడు. భారీగానే నిర్మాణంపై ఖర్చు పెట్టాడు ధనుష్.
Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ కథా నేపథ్యం ఏంటంటే..?
రొమాంటిక్ కామెడీగా వచ్చిన NEEKలో పవీష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ లీడ్ రోల్స్ చేసారు. ఇందులోని గోల్డెన్ స్పారో సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. కాగా నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయింది. వుండర్ బార్ ఫిల్మ్స్, ఆర్కే ప్రొడక్షన్ కంపెనీపై తెరకెక్కుతోన్న NEEK తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేయగా తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన పా పాండి, రాయన్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మేనల్లుడితో చేసిన ధర్డ్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా కామెడి యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ హిట్ తో డైరెక్టర్ గా ధనుష్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసాడు. ఒక ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న’ఇడ్లీ కడాయ్’ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. ఇటు దర్శకుడిగా అటు హీరోగా ధనుష్ సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్నాడు.