విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ్ సంస్త సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన విడుదల కావాల్సిన కింగ్డమ్ షూటింగ్ డిలే కారణంగా డీలే అవుతూ మొత్తానికి ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది.
Also Read : Kaantha : దుల్కర్ సల్మాన్ కాంత టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
తాజాగా విడుదలైన కింగ్డమ్ ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. విజయ్ దేవరకొండ మరో హిట్ కొట్టబోతున్నట్టు ఉంది.అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే కానిస్టేబుల్ గా పని చేస్తూ ఓ అండర్ కవర్ ఆఫీసర్ గా ఓ ఆపరేషన్ లో భాగంగా కొందరితో కలిసి ప్రయాణించే హీరో చివరికి రాక్షసులలాంటి వాళ్ళ తరపున ఎందుకు నిలబడ్డాడు. ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు శత్రువులు గా మారారు అనే కథ నేపధ్యం ఉండబోతుందట. అయితే సెకండాఫ్ సినిమా పూర్తిగా వేరే టర్న్ తీసుకుంటుందని యుగానికి ఒక్కడు లాంటి పునర్జన్మ లాంటి కాన్సెప్ట్ ఉండనుందట. ఆ ఎపిసోడ్స్ కు అనిరుధ్ ఇచ్చిన నేపధ్య సంగీతం పవర్ఫుల్ గా ఉంటుదని తెలిసింది. అలాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అదరగొట్టేశారట. టోటల్ గా కింగ్డమ్ ఒక ఎమోషనల్ రైడ్ మాత్రమే కాదు విజయ్ ఫ్యాన్స్ కు ఇదొక విజువల్ ఫీస్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. కింగ్డమ్ విజయ్ కు హిట్ ఇస్తోందో లేక ఎప్పటిలానే ప్లాప్ ఇస్తుందో మరో మూడు రోజుల్లో తెలుస్తుంది.