యంగ్ టాలెంట్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న “తిమ్మరుసు” సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూలై 30న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం సినిమా హాళ్ళలో రిలీజ్ అయ్యే మొదటి తెలుగు సినిమా “తిమ్మరుసు” కానుంది. కాగా ఇందులో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
Read Also : ఆకాష్ పూరీ బర్త్ డే సందర్భంగా ‘చోర్ బజార్’ ఫస్ట్ లుక్
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ లీగల్ క్రైమ్ థ్రిల్లర్ కి శ్రీచరన్ పాకాల సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో కాంచరన, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. 2019లో వచ్చిన కన్నడ చిత్రం ” బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని “ని రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇది 2017లోని కొరియన్ మూవీ “న్యూ ట్రయల్” ఆధారంగా రూపొందించబడింది. ‘తిమ్మరుసు’కి సంబంధించిన అన్ని పనులు పూర్తి కావడంతో జూలై 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సత్యదేవ్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.