నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Also Read: Jr. NTR : తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. ఎన్టీఆర్ కోటి విరాళం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మౌత్ టాక్ తాజా సరిపోదా శనివారం దూసుకెళుతోంది. రిలీజ్ ఆయిన నాలుగు రోజులకు గాను రూ. 68.52 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లోను నాని సినిమాకు సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఈ చిత్రం 2.05 మిలియన్ కలెక్షన్స్ రాబట్టి తన జర్నీ కొనసాగిస్తోంది. టికెట్స్ బుకింగ్స్ లో సరిపోదా శనివారం జోరు చూపిస్తోంది. BookMyShow లో సరిపోదా శనివారం 1 మిలియన్ టిక్కెట్ విక్రయాలను దాటింది. ఒకసారి బుకింగ్ వివరాలు పరిశీలిస్తే
ఆగస్టు 24 – 12.68K
ఆగస్టు 25 – 16.49K
ఆగస్టు 26 – 19.01K
ఆగస్టు 27 – 31.56K
ఆగస్ట్ 28 – 90K
ఆగస్టు 29 – 191.44K
ఆగస్టు 30 – 194.58K
ఆగస్టు 31 – 204.71K
సెప్టెంబర్ 1 – 147.15K
సెప్టెంబర్ 2 – 66.07K
మొత్తంగా 1 మిలియన్ మార్క్ అందుకుని నాని సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. సరిపోదా శనివారం సక్సెస్ మీట్ ను ఈ శనివారం నిర్వహించే యోచనలో ఉంది టీమ్.