బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధ పూరి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
Also Read: Mirai : రిలీజ్‌కి ముందే లాభాల బాటలో మిరాయ్..
సాహు గారపాటి మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ కౌశిక్ ఈ కథని గత ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. చాలా నచ్చింది. ఇప్పటి వరకు చాలా హారర్ కథలు వచ్చాయి. కానీ ఈ కథ మాత్రం చాలా యూనిక్‌గా హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండు ఆకట్టుకుంటాయి. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్ దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్‌ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇలాంటి హారర్ థ్రిల్లర్ రాలేదు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ కలిగిందో సినిమా చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. ఈ సినిమాకి అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. యానిమల్ పుష్ప సినిమాలు చేసిన టెక్నీషియన్స్ మిక్సింగ్ చేస్తున్నారు. రన్ టైం కూడా చాలా క్రిస్ప్ గా ఉంటుంది. తప్పకుండా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. సాయి గారు ఎప్పటి వరకు కమర్షియల్ మాస్ సినిమాలు చేశారు. ఈ సినిమాలో ఆయన ప్రజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. మూవీలో రెండు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా వున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి సీరియస్ హారర్ ఫిల్మ్‌గా టర్న్ అవుతుంది. దాదాపు రెండు కోట్లతో సెట్ వేయడం జరిగింది. సెట్ చేయడానికి నెల రోజులు సమయం పట్టింది. మా డైరెక్టర్ గారు ముందు అజినిష్‌తో ట్రావెల్ అయ్యారు. అయితే ఆయన షెడ్యూల్ కుదరకపోవంతో సాంగ్స్ ని చైతన్ భరత్ తో చేయించాం.రీరికార్డింగ్ కోసం ఒకటి రెండు రీల్స్ ఇచ్చాం. తను చేసింది అద్భుతంగా ఉంది. అందుకే తననే కంటిన్యూ చేసాం. మేము పెద్ద సినిమాలే చేయాలని ఆలోచనలో ఉన్నాం’ అని తెలిపారు.. ఈ సినిమా బిజినెస్ ఎలా జరిగింది? అంటే..
‘బిజినెస్ విషయంలో మేము చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాము. కౌశిక్ చాలా మంచి నేరేటర్. కథని చాలా అద్భుతంగా చెబుతాడు. చాలా మంచి మేకర్. మోడరన్ ఫిల్మ్ మేకింగ్ స్టయిల్‌తో సినిమాని తీశారు. అనుపమకు ఎప్పటినుంచో ఇలాంటి హారర్ కంటెంట్ చేయాలని ఉండేది. తనకి ఈ సినిమాలో మంచి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ దొరికింది. తన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది.సెన్సార్ ఎలాంటి కట్స్ ఇవ్వలేదు. సీరియస్ హారర్ సినిమాని చాలా ఎంగేజింగ్ గా చేశారు, చాలా బాగుంది అని చెప్పారు. కార్మికుల సమ్మె వల్ల 15 రోజుల షూటింగ్ ఎఫెక్ట్ అయింది.