సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్న, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. తన ఫోటోలు, రీల్స్, పోస్ట్‌లతో ఎప్పటికప్పుడు అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇటీవలే ‘ఫుల్ అప్స్ చేయకపోతే కామెంట్స్ చేయొద్దు’ అనే సెటైరికల్ పోస్ట్‌తో చురుకుగా స్పందించిన సామ్, తాజాగా తన డైలీ లైఫ్ గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ పెట్టింది.
Also Read: Kanda2 : ‘అఖండ 2’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన సమంత.. ‘లంచ్‌కి మధ్యాహ్నం కూర్చుంటే, లేచేసరికీ సాయంత్రం అయిపోతుంది’ అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ‘టూ క్యూటీస్ ఇన్ వన్ ఫ్రేమ్’ అంటూ కామెంట్ తో సరదాగా స్పందిస్తున్నారు. ఇక సమంతకు ఇండస్ట్రీలో ఎన్నో పరిచయాలు ఉన్నా, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం కొద్దిమంది మాత్రమే. అందులో కీర్తి సురేష్ టాప్ లిస్ట్‌లో ఉంటారు. ‘మహానటి’ సినిమాతో ఏర్పడిన వీరి బంధం, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బీచ్ వాక్స్, పార్టీలు, ట్రిప్స్ – వీరిద్దరూ కలిసి కనిపించడం అభిమానులకు మామూలే. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్స్ తమ కెరీర్‌తో బిజీగా ఉన్నా, స్నేహానికి మాత్రం సమయం కేటాయిస్తూ రిలేషన్‌షిప్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు.