Site icon NTV Telugu

Samantha: వెకేషన్లో సమంత.. కానీ ఎవరితో?

Samantha Vacation

Samantha Vacation

సమంత ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస సినిమాలు చేయడం లేదు, కానీ నిర్మాతగా బిజీగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆమె, ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వెకేషన్‌కు వెళ్లింది. తాజాగా, ఆమె తన వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఒక ఫోటోలో ఆమె మోనోకినీ ధరించి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుండగా, మరో ఫోటోలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తోంది.

Also Read: Thuglife : థగ్ లైఫ్ 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

అయితే, ఆ ఫోటోలో ఆమె పక్కన మరో వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరనేది ముఖం కనిపించకపోవడంతో స్పష్టంగా తెలియలేదు. కానీ, ప్రస్తుతం ఆమె రాజ్ నిడిమోరును డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోండడంతో సమంత పక్కన ఉన్నదీ ఆయనే అని అంటున్నారు.. నిజానికి, ఆమె ఇటీవల తన మొదటి సినిమాకు సంబంధించిన టాటూను తొలగించుకుని వార్తల్లో నిలిచింది.

Also Read: Balakrishna: మోస్ట్ వయలెంట్ డైరెక్టర్ తో బాలయ్య?

ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, రాజ్ తన మొదటి భార్య నుంచి ఇంకా విడాకులు పొందలేదు. విడాకులు వచ్చిన తర్వాతే ఇద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి, వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సమంత హీరోయిన్‌గా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తోంది. అలాగే, ‘రక్త బ్రహ్మాన్డ’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.

Exit mobile version