సమంతా రూత్ ప్రభు మాజీ భర్త నాగ చైతన్య ఇటీవల శోభితా ధూళిపాళను సంప్రదాయబద్ధంగా రెండో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ దంపతులు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి తర్వాత, సమంతా రూత్ ప్రభు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సమంత రూత్ ప్రభు ఇటీవల చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అన్న డేవిడ్ భార్య నికోల్ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “మంచి వదినలు కూడా ఉన్నారు, నేను ,మా వదినని ప్రేమిస్తున్నాను” అని సమంతను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ షేర్ చేశారు.
Samantha: శోభిత నాగచైతన్య వివాహ సమయాన సమంత ‘బాంబ్’ పోస్ట్!
దానికి సమాధానంగా సమంత ‘లవ్ యూ’ అంటూ రీపోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా సమంత మరియు నాగ చైతన్య 2017 లో వివాహం చేసుకున్నారు, అయితే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. వారు తమ వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు అక్టోబర్ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఒకరి అభిమానులు మరొకరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం.