శోభిత నాగచైతన్య ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య- సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. అయితే నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తరువాత సమంత సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం నాడు సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఒక వీడియో షేర్ చేసింది.
Pushpa 2 : అస్సలు తగ్గేదేలేదని.. ఎందుకు తగ్గినట్టు?
నిజానికి అదే రోజు నాగచైతన్య శోభిత వివాహం జరిగింది. ఆ వీడియో షేర్ చేస్తూ ఒక పువ్వు లాగా త్వరగా పాడైపోకు ఒక బాంబులాగా విధ్వంసం సృష్టించు ఫైట్ లైక్ ఏ గర్ల్ అంటూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. సరిగ్గా అదే రోజు నాగచైతన్య షో మీతో ధూళిపాళ్లకు తాళి కట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో సమంత వారి గురించే కామెంట్ చేసి ఉంటుంది అనే వాదన వినిపిస్తోంది. అయితే సమంత అభిమానులు మాత్రం అది వారి గురించి అయి ఉండకపోవచ్చు అని సాధారణంగా ఆమె చేసిన కామెంట్ ను అనవసరంగా వేరే విషయాలకు ముడి పెట్టాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు.