టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడం గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత, రాజ్ దంపతులు ఆయన ఇంటికి చేరుకోగా, అత్తారింటివారు వారికి సాదర స్వాగతం పలికారు. ఈ ఆనందకరమైన సందర్భానికి సంబంధించిన ఫొటోలను రాజ్ చెల్లెలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో దాదాపు అగ్రశ్రేణి హీరోలందరితో నటించిన సమంతకు.. ఆమె పెళ్లి సందర్భంగా పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు కరువయ్యాయి. సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్ల పెళ్లికి సినీ ప్రముఖులు, సహచర నటీనటులు స్పందించి విషెస్ చెబుతుంటారు. కానీ, సమంత విషయంలో మాత్రం అలాంటి స్పందన కొరవడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Rashmika Mandanna : ఇక అందరి చూపులు రష్మిక వైపే!
ఒకవైపు ఇండస్ట్రీ నుంచి స్పందన లేకపోగా.. మరోవైపు కొంతమంది ఆమె పెళ్లిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సమంత ఒకప్పటి మేకప్ స్టైలిస్ట్ సాద్నా సింగ్, నటి పూనమ్ కౌర్, రాజ్ నిడిమోరు మొదటి భార్య సమంత పెళ్లిని ఉద్దేశిస్తూ పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు. సమంత పెళ్లి వార్తలు ఒకవైపు ఉండగా, మరోవైపు నాగచైతన్య-శోభిత జంట వార్తల్లో నిలిచింది. 2024 డిసెంబర్ 4న ఒకటైన చైతు, శోభిత తమ మొదటి పెళ్లిరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా శోభిత ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. “చైతు వచ్చాకే నా జీవితం పరిపూర్ణమైంది” అని శోభిత ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. సమంత పెళ్లి ఫొటోలకు ధీటుగా శోభిత ఈ వీడియో రిలీజ్ చేసిందంటూ సమంత-నాగచైతన్య ఫ్యాన్స్ మధ్య కౌంటర్స్ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది.