టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో.. స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన సమంత, ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. ఇటీవల ఆమె నటన తోనే కాక, నిర్మాతగా కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘శుభం’ హారర్-కామెడీ సినిమాతో ప్రొడ్యూసర్‌గా తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సమంత, తాజాగా డైరెక్షన్ వైపు అడుగులు వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సమంత ఓ క్యూట్ లవ్ స్టోరీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిందని, అదే కథను ఆమె స్వయంగా డైరెక్ట్ చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
Also Read : Kiran Abbavaram : వెడ్డింగ్ డే సేలబ్రేషన్‌లో.. కిరణ్-రహస్య క్యూట్ మూమెంట్స్
ఇప్పటికే కొన్ని యంగ్ అప్‌కమింగ్ ఆర్టిస్టులతో డిస్కషన్స్ కూడా జరిపిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను సమంత తన సొంత బ్యానర్‌లోనే నిర్మించాలనుకుంటోంది, తద్వారా నటన, నిర్మాణం, డైరెక్షన్ మూడు విభాగాల్లో తన టాలెంట్‌ను చూపించబోతుంది. సమంత గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’, ‘హనీ బన్నీ’ వంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌లో నటన ద్వారా తన స్థాయిని పెంచుకుంది. యాక్షన్ రోల్స్‌లో తన కృత్తి స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు డైరెక్టర్‌గా మారడం ద్వారా, ఆమె కొత్త కోణాన్ని చూపించబోతోంది. దీంతో అభిమానుల్లో డైరెక్టర్‌గా సమంత తన టాలెంట్‌ను ఏ విధంగా పరీక్షించుకుంటుందో చూడాలనని ఆసక్తి నెలకొంది.
