టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ బేస్ గురించి చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. బాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జతకట్టింది. కానీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి, తర్వాత విడాకులు, అనారోగ్యసమస్యలు ఇలా ఊహించని విధంగా సమంత లైఫ్ టర్న్ అయ్యింది. మయోసైటీస్ తర్వాత సామ్ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసి, వరుసగా తనకు ఓపిక ఉన్నంతలో మూవీస్, సిరీస్ చేస్తున్న సామ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే రీసెంట్‌గా సిడ్నీ పర్యటనలో పాల్గోన్న సమంత ప్రస్తుతం అక్కడ జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నింది. ఈ సందర్భంగా కెరీర్ గురించీ, సక్సెస్ గురించీ సమంత ఆసక్తికరంగా మాట్లాడుతూ..
Also Read: Regina : ఆయనను చూస్తేనే భయమేసేది…
‘ఇబ్బుదుల నడుమ కెరీర్‌ను సాగించడం.. విజయం సాధించడం.. ఈ పరిణామాన్ని నేనేం గొప్పగా భావించను. సామాజిక పట్టింపులు, కట్టుబాట్ల నుంచి విముక్తి పొందడమే ఒక స్త్రీ నిజమైన విజయం. నచ్చినట్టు బతకడమే అసలైన సక్సెస్. అభిరుచికి తగ్గట్టు పనులు చేయడం సక్సెస్. నిజజీవితంలో పోషించే ప్రతి పాత్రనూ సమర్ధవంతంగా రాణించగలగడమే సక్సెస్. ఆ విషయంలో ఒక స్త్రీగా నన్ను నేను చూసుకుని గర్విస్తా. కెరీర్ పరంగా నేనేంటో అందరికీ తెలుసు. కానీ ఒక్క నటిగా మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థ మొదలు పెట్టాను. వినూత్నమైన కథలను, కొత్త టాలెంట్‌ను సమాజానికి అందించాలనే దృక్పధంతోనే నిర్మాతగా మారాను’ అని తెలిపింది సమంత. ఇక ఈ పర్యటనలో అక్కడ యువతతో ఆమె మాట్లాడుతూ ‘చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లాలని.. సిడ్నీ యూనివర్సిటీ లో చదువుకోవాలని కలలు కనేదాన్ని. కానీ ఆ ఒక్క కోరిక అప్పుడు తీరలేదు. ఇదిగో.. ఇప్పుడు ఇలా తీర్చాడు దేవుడు’ అని చెప్పుకొచ్చింది సమంత.