బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రపంచ దేశాల్లో తెలియని వారంటూ ఉండరు. ఇప్పుడేదో చాలా మంది హీరోలు వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు కానీ, సల్మాన్ ఖాన్ ఎప్పుడో ఈ ట్రెండ్ స్టార్ట్ చేశాడు. అతని సినిమా వస్తుందంటే చాలు బాషా తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన 2, 3 రోజుల్లోనే వంద కోట్లు వచ్చి పడేవి. ఇప్పుడు మాత్రం కాస్తా సినిమాలు తగ్గించాడు.కానీ మనసు పెట్టి సల్మాన్ మంచి కథతో రావాలేగానీ ఆయనకున్న క్రేజ్ కి వందకి వంద కోట్లు రావడం పక్కా. అయితే కెరీర్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా మత్రం సల్మాన్ కి ఇంకా పెళ్లి కాలేదు.. ఎవరైనా దాని గురించి అడిగితే షష్ఠిపూర్తి వయసులో ఇంకేం పెళ్లి అని అంటుంటాడు. అతడికి 60 వయసు సమీపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ సోషల్ మీడియా గురించి,యువత పై వైరల్ కామెంట్స్ చేశాడు..
Also Read:Kareena Kapoor: ఏదైనా మనదాకా వస్తే కానీ అర్థం కాదు: కరీనా కపూర్
ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ.. ‘ ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో ఎవరు ఎక్కడికి పోతున్నారు.. ఎవరితో పోతున్నారో మనకు తెలిసేది కాదు. జీవితం సింపుల్ గా ఉండేది. ఇప్పుడు ఫోను చేతిలో ఉండి, ఎవరినైనా ఫాలో చేస్తున్నారు అంటే చాలు. మొత్తం సమాచారం వచ్చేస్తుంది. ఆమె ఎక్కడికి పోయింది.. ఎవరిని కలుసుకుంటుంది.. ఏ పోస్టు పెట్టింది. అంటూ ఇలా ఆగకుండా స్క్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది. ఇదంతా పెద్ద మనోవేదన. గడిచిపోయిన విషయాలు మోస్తూ బతకొద్దు, వర్తమానంలో జీవించాలి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే దాని కోసం కష్టమైన లక్ష్యాలతో యువత ప్రేమలో పడాలి.. మనసు, శరీరం వద్దంటున్న, కృషి తో సాధించాలి. నేటి తరం యువతలో నేను ఎప్పటికీ నేర్చుకోలేక పోయే విషయాలు చాలా ఉన్నాయి’ అంటూ సల్మాన్ యువతకు సూచించారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.