హీరోలకు స్టార్‌డమ్‌తో పాటు..బెదిరింపులు కూడా వస్తాయి. ఇలాంటి వార్తలు ఎక్కువగా బాలీవుడ్ నుంచి వింటుంటాము. ఎన్సీపీ నేత బాబా సిద్ధీఖి హత్య తర్వాత హీరోలపై బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో, ముంబయి పోలీసులు ఆయనకు వైప్లస్ భద్రతను సమకూర్చారు. అంతే కాదు ముంబైలో సల్మాన్‌ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు బుల్లెట్‌ఫ్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్‌ను కూడా ఏర్పాటు చేశారట. వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ షూటింగ్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. అవుట్‌డోర్ షూటింగ్స్‌కు కొంత దూరంగా ఉంటున్నార. అయితే తాజాగా ఈ బెదిరింపులపై సల్మాన్ ఖాన్ స్పందించాడు.
Also Read : Sara Ali Khan : అలియాకు నేషనల్ అవార్డు రావడం.. అసూయగా అనిపించింది
సల్మాన్ మాట్లాడుతూ.. ‘ నేను దేవుడిని ఎక్కువగా నమ్ముతాను. ఆయనే అన్నీ చూసుకుంటారు. ఎవ్వరైనా ఆయుష్షు ఉన్నంత కాలం జీవిస్తారు. ఈ బెదిరింపుల కారణంగా ఇంటి వద్ద, షూటింగ్ లొకేషన్స్ ఇలా అన్ని చోట్లా నా చుట్టూ భద్రత పెరిగింది. కొన్ని సార్లు ఈ భద్రత కూడా సవాలుగా అనిపిస్తుంది. చెప్పాలి అంటే చావుని ఇవేవి ఆపలేవు. తెలిసి కూడా తపన పడటం, జాగ్రత్తలు తీసుకోవడం సుద్ద దండగా అని నా అభిప్రాయం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సల్మాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.