బాలీవుడ్ అమృత సింగ్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ బిగినింగ్‌లో అపజయాలు ఎదురుకున్నప్పటికి.. తన నటన, అందంతో తనకంటూ ఫేమ్.. ఫాలోయింగ్ మాత్రం దక్కించుకుంది. ప్రజంట్ ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోన్న సారా అలీఖాన్, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటిస్తోంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన సారా, అలియాకు నేషనల్ అవార్డు రావడం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
Also Read: Vidya Ballon : హీరోయిన్స్‌ని అమ్మమలుగా చూపిస్తూ.. హీరోలు మాత్రం హీరోలాగే ఉంటున్నారు..
2021 లో .. 69వ జాతీయ చలన చిత్ర పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. అందులో బాలీవుడ్ నుండి ఉత్తమ నటీమణులుగా ఆలియా భట్, కృతి సనన్ సంయుక్తంగా ఈ అవార్డు అందుకోనున్నారు. ఇందులో ‘గంగుభాయ్ కతయావాడి’ సినిమాలో నటనకు గాను ఆలియా భట్‌కు ఈ నేషనల్ అవార్డు వరించింది. అయితే దీని గురించి రీసెంట్‌గా ఓ మీడియాతో మాట్లుడిన సారా అలిఖాన్.. ‘ప్రజంట్ అలియా లైఫ్ ఎంతో ఆనందంగా ఉంది. కెరీర్ విషయంలోనే కాదు. వ్యక్తిగతంగానూ ఆమె సంతోషంగా జీవిస్తున్నారు. ఈ స్థాయికి రావడం కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. కానీ, ఆమెకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఒక నటిగా నేను అసూయ పడ్డాను. అలాంటి సినిమాలో నాకు అవకాశం ఎందుకు రాలేదనిపించింది. ఎదుటివారిని చూసి అసూయ పడడం సహజం. కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. ఆ కష్టాన్ని ఎవరూ చూడరు. అవార్డును మాత్రమే చూస్తారు. నేనూ అలానే భావించాను. అలాంటి రోజు కోసం వైట్ చేస్తున్నాను’ అని సారా అలీఖాన్ తెలిపింది.