Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Salman Khan Ex Girlfriend Somy Ali Says He Didnt Know Bishnoi Community Worship Blackbuck

Salman Khan: సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

Published Date :October 21, 2024 , 3:48 pm
By Bhargav Chaganti
Salman Khan: సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

లారెన్స్ బిష్ణోయ్ నుండి వచ్చిన హత్య బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి తోడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు నటి, సల్మాన్ మాజీ ప్రియురాలి సోమీ అలీ లారెన్స్ బిష్ణోయ్ అలాగే సల్మాన్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. సోమి మాట్లాడుతూ, ‘నేను అప్పట్లో అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లేదానిని, కానీ ఈ సంఘటన జరిగినప్పుడు నేను అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లలేదు. అప్పట్లో సల్మాన్‌కి వేట అంటే చాలా ఇష్టం. ఆయనతో వెళ్ళినపుడు నేను జంతువులని చూసి దగ్గేదానిని వెంటనే అవి పారిపోయేవి, ఎందుకంటే నాకు వేట అంటే ఇష్టం లేదు అని ఆమె అన్నారు.

Actress Shabrin: మేనమామతో ప్రేమాయణం.. మేనల్లుడి కిడ్నాప్ కేసులో నటి అరెస్ట్

ఈ షూటింగ్ సమయంలో సల్మాన్ నన్ను తనతో తీసుకెళ్లలేదు, నేను నిన్ను వేటకు తీసుకెళ్ళను, లేకుంటే నీ వల్ల అవి పారిపోతున్నాయని సల్మాన్‌ చెప్పుకొచ్చాడని ఆమె అన్నారు. ఇక బిష్ణోయ్ కమ్యూనిటీలో కృష్ణజింకలను పూజిస్తారన్న విషయం సల్మాన్‌కు తెలియదని, అందుకే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని సోమీ పేర్కొన్నారు. తనకు తెలియని విషయానికి సల్మాన్ ఎందుకు క్షమాపణలు చెప్పాలి? తెలిసీ తెలియక ఏదో చేసినట్టు, బలవంతంగా క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అని ఆమె అన్నారు. సల్మాన్ చాలా అహంకారి కానీ మంచి పేరు తెచ్చుకున్నాడని అంటున్నారు. ఈ రోజు నాకు అతనితో లేదా అతని కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదు. బాలీవుడ్‌లోనో, హాలీవుడ్‌లోనో ఎవరినీ హత్య చేయడం నాకు ఇష్టం లేదు, హింస ఎప్పుడూ పరిష్కారం కాదని అన్నారు.

సోమి అలీ మాట్లాడుతూ.. వేట జరిగిన ప్రదేశం 80 ఎకరాల్లో విస్తరించి ఉందని, అందుకే సల్మాన్ ఖాన్ మాత్రమే వేటకు వెళ్లారని, మరెవరూ అక్కడికి వెళ్లలేదని అన్నారు. అయితే సల్మాన్‌ స్టార్‌ కాబట్టి టార్గెట్‌ చేస్తున్నారు. కానీ చాలా మంది ప్రజలు వేటాడేందుకు ఆ ప్రదేశానికి వస్తారు. ఇప్పటివరకు ఇంకెవరూ కృష్ణ జింకను వేటాడలేదా? అని ఆమె పశ్నించారు. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకలను పూజిస్తారనే విషయం సల్మాన్‌కు తెలియదని అన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సల్మాన్ తనతో కూడా మాట్లాడాడని సోమి అలీ వెల్లడించారు. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకను ఆరాధిస్తారనే విషయం తనకు తెలియదని సల్మాన్ ఖాన్ తనతో చెప్పినట్లు సోమీ తర్వాత వెల్లడించారు. సల్మాన్‌కి కృష్ణ జింకను ఆరాధిస్తారనే విషయం తెలియదని బిష్ణోయ్‌ వర్గీయులు అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bishnoi Community
  • Blackbuck
  • Salman Khan ex girlfriend
  • Somy Ali

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions