టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేస్తూనే, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఫొటోలు, వీడియోలు అంతగా మార్ఫింగ్ అవుతున్నాయి కాబట్టి నకిలీ కూడా అసలైనట్టే కనిపిస్తోంది. తాజాగా ఈ సమస్య బారిన ప్రముఖ నటి సాయిపల్లవి పడటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Also Read :Bathukamma 2025 : బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కుష్బూ
బీచ్‌లో సాయిపల్లవి?
ఇటీవల సాయిపల్లవి చెల్లెలు పూజా** బీచ్ లో తీసుకున్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలలో ఎక్కడా సాయిపల్లవి ఎబ్బెట్టుగా కనిపించేలా లేదు. కానీ అదే సమయంలో, ఎవరో ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి, సాయిపల్లవి ఇమేజ్‌ను చెడగొట్టే ప్రయత్నం చేశారు. నిజానికి బీచ్‌లో సరదాగా దిగిన ఫొటోల కన్నా కానీ మార్ఫింగ్ చేసిన కొన్ని నకిలీ ఫొటోలు వైరల్ కావడంతో, “రామాయణ్‌లో సీతగా నటిస్తున్న సాయిపల్లవి ఇలా ఫోజులా?” అంటూ కామెంట్లు మొదలయ్యాయి. “సాయిపల్లవికి ఏమైందో?” అంటూ కొందరు విమర్శలు చేశారు.
Also Read :Sai Pallavi : సాయిపల్లవి బికినీ ఫొటోలు నిజమా? మార్ఫింగా
ఫ్యాన్స్ ఫైర్
అయితే నిజం బయటకు రావడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. అసలు ఫొటోలలో ఎలాంటి సమస్య లేదని తెలుసుకున్న తరువాత, ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. నిజం ఏమిటో తెలుసుకోకుండా ఎవరెవరో కామెంట్లు చేయడం సరికాదని,” అయినా ఎవరు “ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పే హక్కు మీకెక్కడిది?” అంటూ సాయిపల్లవి అభిమానులు మండిపడ్డారు. AI, మార్ఫింగ్ టెక్నాలజీ వలన సెలబ్రిటీలకే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదాన్ని నమ్మకూడదని, నిజానిజాలు తెలుసుకున్న తరువాత మాత్రమే స్పందించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి చూపించింది.