కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ ఫిలిం షూటింగ్ చేస్తుండగా, కాలు జారి పడిపోవడంతో కాలికి గాయమైంది. వెంటనే ఆయన టీం అలర్ట్ అయ్యి, ఆయనకు పెద్ద గాయం ఏమీ కాలేదు కానీ, డాక్టర్ల సూచనల మేరకు ఆయన రెండు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోలేదని అంటున్నారు. డాక్టర్లు అందరికీ షాక్ ఇస్తూ, ఆయన రెండో రోజు షూటింగ్ కి హాజరయ్యాడని సమాచారం. వాస్తవానికి, ఎన్టీఆర్ తో ఒక యాడ్ ఫిల్మింగ్ షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్లాన్ చేశారు. ఈ మేరకు ఒక సెట్ కూడా సిద్ధం చేశారు.
Also Read:USA: ట్రంప్ ప్రసంగానికి ముందు, అమెరికాలో భారీ కుట్ర భగ్నం..
అయితే, ఇది అనుకోకుండా ఎన్టీఆర్ గాయపడటంతో ఆయనను డాక్టర్లకు చూపించగా, ఆయనకు బెడ్ రెస్ట్ సూచించారు. అయితే, సెట్ నిర్మించిన విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ రెండో రోజు గాయంతో బాధపడుతూనే, నొప్పిని భరిస్తూ వచ్చి షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేసి, ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తనను నమ్మి నిర్మాత పెట్టిన ఖర్చు కోసం ఎన్టీఆర్ ఈ మెరుగు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఎన్టీఆర్ గనక రెస్టు తీసుకుంటే, ఆ సెట్ మరి కొన్నాళ్లపాటు అలాగే ఉంచాల్సి వచ్చేది. తద్వారా అదనపు భారం నిర్మాత మీద పడేది. కానీ, ఆ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే షూటింగ్ కి హాజరైనట్లుగా తెలుస్తోంది.