Sai Durgha Tej: పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకల్లో సాయి దుర్గా తేజ్.. చిన్నారులతో కలిసి కేక్ కట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Durgha Tej: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. గోపాల్ నగర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సాయి దుర్గా తేజ్ అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా సాయి దుర్గా తేజ్ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.. రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన వారిని, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా హీరో సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను కేవలం అభిమానుల సంబరాలకే పరిమితం చేయకుండా సామాజిక సేవతో ముడిపెట్టడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
Also Read
- Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
- Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
- I'm Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!