The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise OTT: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ హైప్ నెలకొంది. ఓ జాతి మనుగడ కోసం సాగే పోరాటం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసేశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఈనెల 22 నుంచే ‘ది ప్యారడైజ్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాను ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇక థియేటర్లలో చూసిన వెర్షన్‌నే ఓటీటీలో స్ట్రీమ్ చేస్తారా లేక రన్‌టైమ్ వల్ల కట్ చేసిన సీన్లను ఏమైనా అదనంగా యాడ్ చేసి ‘ఎక్స్టెండెడ్ కట్’ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా చేయగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ఫుల్ విలన్ రోల్లో మెప్పించారు. సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. థియేటర్లలో చూడటం మిస్సయిన వారు ఈనెల 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీగా చూసేయొచ్చు.
Also Read
ది ప్యారడైజ్ కథ:
సినిమా అంతా 80ల కాలంలో జరుగుతూ ఉంటుంది. సికింద్రాబాద్ దగ్గర ఉన్న పారడైజ్ ప్రాంతంలో ఒక గుర్తింపు కూడా లేని తెగ సవారీలు. ఆ తెగ గుర్తింపు కోసం పాటుపడుతున్న సమ్మక్క (సోనాలి కులకర్ణి) కొడుకే జడల్ (నాని). చిన్నప్పుడే ఒక సంఘటన వల్ల అతనికి తల్లి అంటే అసహ్యం కలుగుతుంది. దీంతో ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకుండా, ఆ పోరాటం చేయకుండా దొంగతనాలు చేసి వ్యవస్థకు ఎదురు వెళితే తప్ప గుర్తింపు దక్కదని భావిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని, కనీసం మనుషుల్లా కూడా సవారీలను ట్రీట్ చేయకుండా ఉన్న శిఖంజ మాలిక్ (మోహన్ బాబు) ఆధిపత్యాన్ని సమ్మక్క ప్రశ్నించగలిగిందా? అసలు సమ్మక్కను కొడుకు ఎందుకు అసహ్యించుకున్నాడు? తన కొడుకు చోటా మాలిక్‌ను తన వారసుడిగా ప్రకటించిన మాలిక్, ఆ ప్రాంతాన్ని అసలు ఎందుకు గుర్తింపు లేని ప్రాంతంగా మార్చేయాలనుకున్నాడు? చివరికి ఏం జరిగింది? అలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.
Welcome to Jadal zamana ❤️🔥 https://t.co/YUttNN6mzx
— Netflix India South (@Netflix_INSouth) October 18, 2026
తాజావార్తలు
-
The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
-
Tesla Roadster: టెస్లా ఫ్లయింగ్ కార్.. భారత్‌లో బుకింగ్స్ ప్రారంభం.. రూ.2.50 కోట్ల వరకు రిజర్వేషన్ అమౌంట్!
-
Horoscope : నవంబర్‌లో అరుదైన ‘మహాలక్ష్మీ రాజయోగం’.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
-
Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!