ప్రజంట్ టాలీవుడ్ లో మొత్తం కన్నడ భామల హవా నడుస్తోంది. గతంలో మలయాళ బ్యూటీలు హల్‌చల్ చేయగా ఇప్పుడు కన్నడ హీరోయిన్‌ల వెంట పడుతున్నారు మన తెలుగు దర్శక నిర్మాతలు. రష్మిక మందానా, ఆషికా రంగనాధ్, శ్రద్ధా శ్రీనాధ్, నభా నటేష్.. ఇలా చాలామంది కన్నడ హీరోయిన్లు టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో ‘సప్త సాగరాలు దాటి’ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రుక్మిణీ వసంత్ చేరింది. ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీకి మరిన్ని తెలుగు చిత్రాల్లో అద్భుతమైన ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. అయితే ఇండస్ట్రీలో అదృష్టం అనేది ఎవ్వరికి ఎలా ఏ రూపంలో వస్తుందో తెలియదు..
Also Read : Akhil : అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ..?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఈ విషయం పై మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచకుంది.. రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో రాణించాలి అంటే అదృష్టం ఉండాలి.. దాని నేను గట్టిగా నమ్ముతాను. ఉదాహరణకు ‘సప్తసాగరాలు దాటి’ చిత్రాన్నే తీసుకుందాం. ఇది నా కెరీర్‌ను మలుపు తిప్పాంది. నేను ఈ సినిమా దర్శకుడికి మెసేజ్ చేయడం వల్ల ఇందులో నటించే అవకాశం లభించింది. అవును.. ఓ రోజు ‘మీ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం అమ్మాయిని వెతుకుతున్నారని ఓ వార్తాపత్రికలో చదివాను. నాకు నటనలో కొంత అనుభవం ఉంది. మీరు అంగీకరిస్తే నేను ఆడిషన్లో పాల్గొంటా’ అని దర్శకుడి ఫోన్ లో ఓ సందేశం పంపించాను. అది చూసి ‘సరే రండి’ అని ఆయన బదులు పంపించారు. కానీ దర్శకుడు నేను పంపించిన మెసేజ్ చదవకపోయుంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదేమో. కాబట్టి ఎంత కష్టపడి పనిచేసిన అదృష్టం అనేది ఎక్కడో కొంచెం ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది రుక్మిణి.