టాలీవుడ్ యాక్టర్ ఆర్కే సాగర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..‘మొగలిరేకులు’ సీరియల్ తో ఈ నటుడు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.దీంతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.2016లో ‘సిద్దార్థ’అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆ తరువాత మరో రెండేళ్లకు ‘మాన్ ఆఫ్ ది మ్యాచ్’ అనే సినిమా చేసారు.ఆ తరువాత మరో మూడేళ్ళ గ్యాప్ తరువాత షాదీ ముబారక్’ అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇప్పుడు మల్లి చాలా గ్యాప్ తరువాత తన కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.ఇప్పుడు ‘ది100’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో సాగర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నారు.‘మొగలిరేకులు’ సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్ సాగర్ ఇప్పుడు మరోసారి పోలీసుగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ టీజర్ ని నేడు రిలీజ్ అయింది మెగా మదర్ అంజనాదేవి చేతులు మీదుగా ఈ టీజర్ ని లాంచ్ చేయడం జరిగింది.ఇదిలా వుంటే సాగర్ ఇటీవలే జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ హీరో ఆంధ్రప్రదేశ్ లో జనసేన తరుపున కాంపెయినింగ్ చేస్తున్నారు. ఈ హీరోకి మెగా కుటుంబంతో ఉన్న బంధంతోనే ఈ మూవీ టీజర్ ని మెగా మదర్ అంజనాదేవి ద్వారా లాంచ్ చేసినట్లు తెలుస్తుంది..ఇక ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. మిష నారంగ్, ధన్య బాలకృష్ణ మరియు గిరిధర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు .