Rishab Shetty: ఎన్టీఆర్ హీరోయిన్‌కు రిషబ్ శెట్టి షాక్.. ‘కాంతార’లో అసలేమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ స్టార రిషబ్ శెట్టి, తాజాగా సోషల్ మీడియాలో చేసిన కొన్ని మార్పులు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రెండురోజుల క్రితం కాంతార నిర్మాణ సంస్థ హోంబలె ఫిల్మ్స్ సోషల్ మీడియా ఖాతాను అన్ ఫాలో చేసిన రిషబ్.. ఇప్పుడు తన సన్నిహిత కో స్టార్‌తో పాటు, కాంతార హీరోయిన్‌ను అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రిషబ్ శెట్టి తన అత్యంత సన్నిహితుడైన కన్నడ నటుడు రాజ్ బి. శెట్టితో పాటు, రుక్మిణి వసంత్‌ను కూడా అన్‌ఫాలో చేశారు. కాంతార సినిమాలో రుక్మిణి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ‘కాంతార’ టీమ్‌తో రిషబ్ శెట్టికి అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
Also Read: Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
ఇప్పుడు రిషబ్ శెట్టి అన్‌ఫాలో చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే, హోంబలే ఫిల్మ్స్ సంస్థను అన్‌ఫాలో చేసినప్పటికీ, ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ వ్యక్తిగత ఖాతాను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. దీనిని బట్టి చూస్తుంటే, సమస్య కేవలం ప్రొడక్షన్ హౌస్ మేనేజ్‌మెంట్‌తో ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఈ వివాదంపై అటు రిషబ్ శెట్టి కానీ, ఇటు నిర్మాణ సంస్థ కానీ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఈ సోషల్ మీడియా గొడవలు ఇలా ఉంటే, రిషబ్ శెట్టి తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు రుక్మిణి వసంత్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉంది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!