ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు బన్నీని అరెస్టు చేయగా బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ప్రబుత్వంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Also Read : Allu Arjun : పుష్ప -2 హిందీ లో ఆల్ టైమ్ రికార్డు
అయితే ఈ విషయాన్నీ తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పలువురు కాంగ్రెస్ కార్యర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టారో వారిని గుర్తించి ఇప్పటికే నాలుగు కేసులు పెట్టారు. నిందితులపై IT యాక్ట్ తో పాటు BNS 352. 3523 (1)b సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బెయిల్ పై బయట ఉన్న అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలనీ సుప్రీమ్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారట పోలీసులు. ఒకవేళ బెయిల్ గనుక రద్దు అయితే బన్నీ జైలుకే వెలతాడేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.