తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కంగువ సినిమాతో డిజప్పోయింట్ చేసిన సూర్య ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక స్వయంగా నిర్మించిన ఈ సినిమా మే1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున రిలీజ్ అయిన రెట్రో మిశ్రమ స్పందన రాబట్టింది.
Also Read : Kollywood : ఆమె చాలా ‘కాస్ట్‌లీ’ గురూ
తెలుగులోను ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేసారు సితార ఎంటెర్టైన్మెట్స్ నాగవంశి. ఇక్కడ కూడా ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది రెట్రో. ఇక ఈ సినిమా మొదటి రోజు కల్కేక్షన్స్ చూస్తే రూ. 17.75 కోట్లు రాబట్టినట్టు ప్రకటించారు. అయితే ఇవి కేవలం తమిళనాడు కలెక్షన్స్ అని తెలిపారు. రెగ్యులర్ టికెట్స్ రేట్స్ తో సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్ నంబర్ కలెక్షన్స్ వసూలు చేసింది రెట్రో. అటు కర్ణాటక లో తెలిసిన సమాచారం ప్రకారం రూ. 2.28 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.63 కోట్లు రాబట్టింది. కేరళలోను రూ. 2.23 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒక మంచి స్టార్ట్ అందుకున్నరెట్రో కు హిట్ 3 నుండి కాస్త పోటీ ఉన్నప్పటికి వీకెండ్ మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.