టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ సినిమాల సందడి నెలకొంది. లేటెస్ట్ రిలీజ్ అవుతున్న సినిమాల కంటే కూడా రీరిలీజ్ సినిమాలు భారీ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఆ మధ్య కాస్త నెమ్మదించిన ఈ రిరిలీజ్ సినిమాల హడావిడి మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన మురారి సినిమాతో మళ్ళి ఊపందుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరు ఇంద్ర, పవర్ స్టార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యాయి. గబ్బర్ సింగ్ రిరిలీజ్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Also Raed: Nandamuri Mokshagna : జూనియర్ నటసింహం నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్..
ఆ ఉత్సహంతో మారిసారి ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ కు క్యూ కట్టాయి. వాటిలో కృష్ణవంశీ ఫామ్ లో ఉన్న రోజుల్లో తెరక్కేకించిన ఖడ్గం అక్టోబరు 2న రీరిలీజ్ కాబోతుంది. హిందూ, ముస్లిం మతాల గొడవల నేపథ్యంలో తెరకెక్కిన 2002లో రిలీజ్ కాగా సంచలన విజయం నమోదు చేసింది. 22 ఏళ్ల తర్వాత మరోసారి రిలీజ్ అవుతోంది ఖడ్గం. ఇక తమిళ హీరో ధనుష్ హీరోగా మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘కొలవెరి 3’ ఈ సెప్టెంబరు 14న మరోసారి రీరిలీజ్ కాబోతుంది. అప్పట్లో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఆడియో పరంగా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ రెండింటితో పాటు గ్లోబల్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ కు పరిచయం అయిన చిత్రం ఈశ్వర్. ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా అక్టోబరు 23న రిలీజ్ కానుంది. మరి వీటిలో ఈ సినిమను ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి