బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టిన రోజు ఇండస్ట్రీలోకి రాకముందు కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా సుక్కు పనిచేశారు. అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్. సుకుమార్ పాఠం చెప్పే తీరుకి ఆకర్షితుడై.. ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టారు. గురువు దర్శకుడిగా మారితే.. తాను అదే బాటలో నడిచారు. ‘ఆర్య 2’ నుంచి సుక్కు వద్ద బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా వర్క్ చేసి ఉప్పెనతో దర్శకుడిగా మారారు.
Monalisa: కుంభ్ మోనాలిసాకి డైమండ్ నెక్లెస్.. ఇచ్చిందెవరో తెలిస్తే షాక్!
తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్‌సీ 16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా వెంకట సతీశ్ కిలారు బుచ్చిబాబు చేత కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు.