కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజురోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. పేదవాళ్ళు, ధనవంతులు, సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా రవీనా టాండన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఢిల్లీలోని కోవిడ్ -19 రోగులకు ఆమె ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఫౌండేషన్‌తో కలిసి రవీనా టాండన్ ఆక్సిజన్ సిలిండర్లను దానం చేశారు. “మా బృందం ఢిల్లీని చేరుకుంది. సముద్రంలో ఒక చుక్క… కానీ అది కనీసం కొంతమందికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను” అంటూ ఆక్సిజన్ సిలిండర్ల ఫస్ట్ షిప్మెంట్ కు సంబంధించిన పిక్స్ ను షేర్ చేశారు రవీనా. ఇక రవీనా టాండన్ ‘కెజిఎఫ్: చాప్టర్ 2’ లో నటించనున్నారు. ఈ చిత్రం జూలై 16 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, మాళవికా అవినాష్ కీలక పాత్రల్లో నటించారు.