Delhi MLA's : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చర్యలకు నిరసనగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు సభకు ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లారు.
తమిళనాడు కోయంబత్తూర్ ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు పేలుడు సంభవించింది. సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆక్సిజన్ సిలిండర్లు ఎలా పేలాయన్నదానిపై ఆస్పత్రి వర్గాలు విచారణ ప్రారంభించాయి.
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజురోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. పేదవాళ్ళు, ధనవంతులు, సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా రవీనా టాండన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఢిల్లీలోని కోవిడ్…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా భారతదేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే కరోనా పై అవగాహన కల్పించడానికి, పేదలకు ఆర్ధిక సహాయం అందించడానికి కొంతమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల ఢిల్లీలోని కొన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపడానికి సుష్మితా సేన్ ముందుకొచ్చారు. ఆసుపత్రుల్లో చాలామంది పేషంట్స్ ప్రాణాలు రిస్క్ లో ఉండడం బాధాకరంగా ఉందని…