సినిమా చేస్తే హిట్ ఖాయం అన్న స్థాయిలో పేరు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే ‘కుబేర’ సినిమాతో దక్షిణ భారతంతో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసింది. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఆమెకు మంచి క్రేజ్‌నే తెచ్చి పెట్టగా, ఒక్కొక్క సినిమాతో తన క్రాఫ్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తోంది. ఇంత విజయాలు సాధిస్తున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను ఓపెన్‌గా షేర్ చేస్తూ… తెరపై ఎలాంటి పాత్రలు చేయాలని అనిపించదో స్పష్టం చేసింది.
Also Read : Peddi : ‘పెద్ది’ సినిమాలో రొమాంటిక్ షెడ్యూల్‌కు లైన్ క్లియర్!
“నాకు స్మోకింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు. పర్సనల్‌గా దానికి పూర్తి వ్యతిరేకం. అందుకే తెరపై కూడా అలాంటి సన్నివేశాల్లో నటించను. స్క్రిప్ట్ వినేటప్పుడు నేను ముందుగానే కొన్ని నిబంధనలు పెడతాను. అందులో ఇది ఒకటి. అలాంటి పాత్రలు చేస్తే ఆడియన్స్ మీద దుష్ప్రభావం పడవచ్చునని నమ్ముతాను. అవసరమైతే ప్రాజెక్ట్ వదులుకుంటాను కానీ అలాంటి సీన్లు మాత్రం చేయను” అని రష్మిక తేల్చిచెప్పింది.
Also read : Thammudu : ‘తమ్ముడు’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
అలాగే సినిమాల పై ప్రజలు చూపే స్పందన గురించి మాట్లాడుతూ..“ఒక సినిమా చూసి మీ అభిప్రాయాన్ని దీనిపై ముద్ర వేయకండి. మీకు నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చాలని అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యానిమల్’ సినిమాతో డైరెక్టర్ మనిషిలోని మరో కోణాన్ని చూపించారు. అది చాలా మందికి నచ్చింది, మరికొంతమందికి నచ్చలేదు. అది సహజం” అని తన మాటల్లో వెల్లడించింది. ఇక రష్మిక చెప్పే విధంగా చూస్తే, ఆమెకు పాత్రల విషయంలో ఉన్న విలువలు, తన వ్యక్తిగత నమ్మకాలపై నిలిచే ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరం స్టార్ హీరోయిన్లలో ఇలా ఓ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవడం అరుదుగా జరిగే విషయం అని చెప్పవచ్చు.