అక్టోబర్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహా సభలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. జాతీయ మహాసభల పోస్టరును ఆవిష్కరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సభల వివరాలు వెల్లడించారు. సీపీఐ జాతీయ మహా సభలు నాలుగేళ్ల తరువాత జరుగుతున్నాయన్నారు. 24వ జాతీయ మహా సభలు విజయవాడలో ఘనంగా జరుపుకుంటున్నాం. 1961, 1975లో గతంలో విజయవాడ జాతీయ సమావేశాలు జరిగాయి. 47 ఏళ్ల తరువాత మళ్లీ ఇక్కడ సభలు నిర్వహిస్తున్నాం. అక్టోబర్ 14న భారీ ర్యాలీ, సభలో డి.రాజా ఇతర నాయకులు పాల్గొంటారు.
18వ తేదీ వరకు జరిగే సభల్లో అన్ని రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు వస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న కమ్యూనిస్టు నాయకులు హాజరవుతారు. సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, ఇతర వామపక్ష నాయకులు సౌభాగ్య సందేశం ఇస్తారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని విధాలా నష్టపోయింది. ప్రజాస్వామ్యానికి పాతర వేసి ఏక వ్యక్తి పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే అన్యాయంగా జైళ్లల్లో పెడుతున్నారు.
ఇళ్లకు సీబీఐ, ఐటీ వాళ్లని పంపి బెదిరిస్తున్నారు. సోనియా గాంధీని కుడా విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు. ఎనిమిదేళ్ళ పాలనలో దేశాన్ని అప్పుల పాలు చేశారు. బ్లాక్ మనీ తేలేదు, ఉద్యోగాలు లేవు….47 లక్షల కోట్లు అప్పు ఉంటే.. రూ. 155 లక్షల కోట్లకు చేర్చారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటు పరం చేశారు. ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పాలని ఏకైక ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రికార్డు సృష్టించారు. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెరిగి పోతున్నాయి. కార్పొరేట్ శక్తులకు మోడీ ఊడిగం చేస్తున్నారు. మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం కూడా మూలన పడేయడం ఖాయం. ఈ అంశాలపై మా జాతీయ సభలలో చర్చిస్తాం అని చెప్పారు సీపీఐ నేతలు.
Harish Rao Letter To Union Minister: కొవిడ్ టీకాల సరఫరా పెంచండి.. కేంద్ర ఆరోగ్య శాఖకు మంత్రి లేఖ..