ప్రజెంట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి దడ పుడుతోంది. దానికి కారణం రష్మిక మందన్న బ్లాక్ బస్టర్స్ అందుకోవడమే. అలాంటి ఇలాంటి హిట్స్ కాదు.. హీరోల కెరీర్ నే మార్చే హిట్స్. ఎక్కడో కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంటరై.. తక్కువ టైంలో స్టార్ డమ్ తెచ్చుకోవడమే కాదు.. అక్కడి హీరోలకు లక్కీ గాళ్ అయిపోయింది. గుడ్ బాయ్, మిస్టర్ మజ్ను ఫెయిల్యూర్ కాస్త చిరాకు తెప్పించినా.. ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తోన్న హీరోయిన్ అంటే రష్మికనే. లవర్ బాయ్ రణబీర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీ యానిమల్. 900 క్రోర్ ప్లస్ కలెక్షన్లు వసూలు చేసిన యానిమల్ లో గీతాంజలిగా ఆకట్టుకుంది నేషనల్ క్రష్ రష్మిక. ఇక్కడ నుండి పట్టిందల్లా బంగారం అయ్యింది. పుష్ప2తో టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ బెండ్ తీసేందుకు తన వంతు స్టఫ్ ఇచ్చింది అమ్మడు. అంతేనా ఇప్పుడు ఛావా విషయంలో ఇదే మ్యాజిక్ రిపీట్ చేసింది.
Masthan Sai: ఆట్ కమల్ హాసన్.. యువతులతో మస్తాన్ సాయి ఎమోషనల్ డ్రామా!
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందే ఛావా. విక్కీ కౌశల్ ఫెర్మామెన్స్ కు వంక పెట్టనక్కర్లేదు. ఇక ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక సెంట్ పర్సెంట్ ఫెర్మామెన్స్ అందించి.. బాలీవుడ్ హీరోలకు రియల్ గేమ్ ఛేంజర్ గా మారింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా 150 కోట్లు కొల్లగొట్టి.. రూ. 200 కోట్లకు పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు విక్కీ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా ఉరి ఉంది. రూ. 300 ప్లస్ సాధించింది. మరీ ఛావాతో విక్కీ ఈ రికార్డులను తిరగరాస్తాడేమో చూడాలి. అలాగే బాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోలకు లక్కీ లేడీగా మారిన రష్మిక.. సికందర్ తో సల్మాన్ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ మాత్రమే కాకుండా.. వెయ్యి కోట్ల మూవీగా మారుస్తుందో లేదో? ఎందుకుంటే.. ఇప్పటి వరకు త్రీ ఖాన్స్ లో కండల వీరుడు తప్ప మిగిలిన ఇద్దరు థౌజండ్ క్రోర్ మార్క్ చూసిన వాళ్లే. ఈద్ సందర్భంగా విడుదల కాబోతున్న సికందర్ సినిమాతో సల్లూ భాయ్ కి రష్మిక గోల్డెన్ లేడీ మారుతుందేమో వేచి చూడాలి.