కన్నడ నుండి బాలీవుడ్‌కు ఎదిగిన సోయగం రష్మిక మందన్న. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ హీరోలకు లక్కీ గర్ల్‌గా మారిపోయింది. యానిమల్, పుష్ప2తో రణబీర్, అల్లు అర్జున్ ఖాతాలోనే కాదు.. ఈ ఏడాదొచ్చిన ఛావా మూవీతో విక్కీ కౌశల్‌కు హయ్యెస్ట్ గ్రాసర్ మూవీలను అందించింది. అలాగే కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ కూడా హిట్స్‌గా నిలవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ నేషనల్ క్రష్ ఎంత హైప్ చూస్తుందో.. అంత హేట్రెట్ ఎదుర్కొంటోంది. దానికి రీజన్ నేషనల్ క్రష్సే. సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది అమ్మడు. రష్మిక చేస్తున్న వ్యాఖ్యలే వివాదానికి కారణమౌతున్నాయి. ముఖ్యంగా కన్నడిగుల హృదయాలను ముక్కలు చేస్తున్నాయి.
Also Read : Betting App Case : బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ విచారణకు ముందుకు హీరో రానా..
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది టీం. ఈవెంట్లో రష్ మాట్లాడుతూ..‘ కొన్ని స్టోరీలు విన్నప్పుడు ఈ స్టోరీ ఫస్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేమీ జరిగాయో.. కొన్ని సిచ్యుయేషన్స్ నా లైఫ్ లోనూ జరిగాయి. ఆ టైంలో నా పక్కన సుధీర్ సర్, దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు‘ అంటూ క్యారెక్టర్లను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. దీంతో కన్నడిగులు, నెటిజన్స్, రష్మిక అంటే గిట్టని వారు.. కన్నడ హీరో, రష్ మాజీ లవర్ రక్షిత్ శెట్టినుద్దేశించే ఈ కామెంట్స్ చేసిందంటూ మండిపడుతున్నారు. విక్టిమ్ కార్డ్, సింపథీ కార్డ్ ప్లే చేస్తుందంటూ మండిపడుతున్నారు. రష్మిక గురించి పాజిటివ్‌గా మాట్లాడిన రక్షిత్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ పలు ఇంటర్వ్యూ, సినీ ఈవెంట్లో నోరుజారి టార్గెట్ అవుతోంది రష్మిక. ఓ ఇంటర్వ్యూలో కిరాక్ పార్టీ గురించి ప్రస్తావించి.. రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ గురించి మర్చిపోవడం కాంతార సినిమా చూడలేదని చెప్పడం వల్ల ట్రోల్ కు గురైంది. ఓ సారి దక్షిణాది మాస్, డ్యాన్స్ లు ఎక్కువ ఉంటాయని చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయి. ఛావా ప్రమోషన్లలో కూడా తన మూలాలు మర్చిపోయి హైదరాబాద్ నుండి వచ్చా అని కామెంట్స్ చేయడం వివాదంలోకి నెట్టాయి. దీంతో కన్నడిగుల కోపానికి గురౌతుంది. ఆమెను ట్రోల్ చేసేస్తున్నారు. అయితే సక్సెస్ ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఇలా కోరికోరి వివాదాలను కొని తెచ్చుకోవడం అవసరమా రష్ అంటున్నారు సూచిస్తున్నారు కొందరు. మరీ మేడమ్ ఈ రిక్వెస్టులు పరిశీలనలోకి తీసుకుని ఫ్యూచర్‌లో మరింత కేర్ ఫుల్ గా మాట్లాడుతుందేమో చూడాలి.