బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీల పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ పాటు రానా ,మంచు లక్ష్మి ల పై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, మంచు లక్ష్మి ,అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై కేసు నమోదు చేయగా ప్రకాష్ రాజ్ రెండు రోజుల క్రితం ఈడీ ఎదుట హాజరయ్యాడు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి కేసు విచారణ చేస్తుంది.
Also Read : GlobeTrotterEvent : సంచలనానికి అంతా రెడీ.. రామోజీలో ఘట్టమనేని ఫ్యాన్స్ రచ్చ రచ్చ
తాజాగా దగ్గుబాటి హీరో రానా కు విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఐడీ పోలీసుల ముందుకు హీరో రానా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో విచారణకు హాజరుకానున్నాడు. పలు బెట్టింగ్ యాప్ లకు గతంలో రానా ప్రమోషన్ చేసాడు. యువతను తప్పుదోవ పట్టించే ప్రమోషన్స్ చేసారని రానాతో పటు పలువురు సెలెబ్రిటీస్ పై కేసులు నమోదయ్యాయి. సినిమా సెలెబ్రిటీస్ పై నమోదైన కేసులను సీఐడీకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సెలెబ్రేటిస్ ను మరోసారి విచారిస్తుంది సీఐడీ. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను పిలిచి విచారించి స్టేట్మెంట్ తీసుకుంది సీఐడీ. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి సీఐడీ ఎదుట విచారణకు హాజరుకానున్నాడు హీరో రానా.