తాజాగా విడుదలైన ‘కుబేర’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత మళ్లీ థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.అంచనాలను మించి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు అదిరిపోయాయి. ధనుష్ యాక్టింగ్ కి వందకు వంద మార్కులు పడినప్పటికి.. నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఇక సమీరా పాత్రను పోషించిన రష్మిక మందన్నా అయితే ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. దీంతో రష్మిక యాక్టింగ్ కు తెలుగు ప్రేక్షకులు మరో సారి ఫిదా అయ్యారు.
Also Read : Lavanya Tripathi : ‘సతీ లీలావతి’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..!
అయితే తాజాగా ఆమె పై వస్తున్న ఈ ప్రశంసల నేపథ్యంలో తన అనుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది రష్మిక. ఈ పాత్రలో ఒదిగిపోయే అవకాశం కల్పించిన దర్శకుడు శేఖర్ కమ్ములకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు..‘శేఖర్ కమ్ముల సార్ దర్శకత్వంలో నటించాలనేది నా కోరిక. ఆ కోరిక ‘కుబేర’ తో నెరవేరింది. సమీరా పాత్రలో నా నటనకు వస్తున్న ఆదరణ చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్రకు శేఖర్ సార్ వల్లే నేను జీవం పోయగలిగాను. ప్రతి సన్నివేశం లో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అలాగే ధనుష్ లాంటి నటుడు పక్కన ఉన్నప్పుడు ప్రతీసీన్‌లో శ్రద్ధ పెట్టాల్సిందే. నాగార్జున సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఆయన నుంచి నేనెన్నో నేర్చుకున్నాను ‘కుబేర’ సినిమా అందరు తప్పక చూడాల్సిన చిత్రం. సమీరా పాత్ర, కథ, మొత్తం ఒక అందమైన గందరగోళం లాంటిది. మీరు చూసిన తర్వాత నా మాట అర్థమవుతుంది’ అంటూ టీమ్‌కి మరో సారి కృతజ్ఞతలు తెలిపారు రష్మిక. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.